కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఈ సినిమా సీక్వెల్ లో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.
దీంతో హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే రఫ్ ఎడిటింగ్ పూర్తి అయిన ఈ సినిమాలో సంజయ్ దత్ పై తెరకెక్కించిన సీన్స్ అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది.
హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. అందుకే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ సినిమా కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గనులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). దశాబ్ధాల క్రితం కోలార్ బంగారు గనుల్లో మాఫియా కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేజీఎఫ్ గనులపై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్న దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించబోతున్నారట.