రాజమౌళి తాజా వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్

రాజమౌళి తాజా వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్

Published on Apr 18, 2020 3:44 PM IST

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఇంట్రో వీడియోని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని ప్రచారం జరుగుతున్న వేళ రాజమౌళి అసలు నిజం బయట పెట్టారు. చరణ్ ఇంట్రో వీడియో కోసం తమ వద్ద చిత్రీకరించిన సన్నివేశాలు ఉండగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్రో కోసం కావలసిన మెటీరియల్ లేదు అని ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. లాక్ డౌన్ కారణంగా బయటికి వేళ్ళ లేని పరిస్థితి, ఏమి చిత్రీకరించాలో, ఇంట్రో వీడియోలో ఏమీ చూపించాలో అర్ధం కావడం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు.

ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ జరిగిందని చిత్ర యూనిట్ అధికారికంగా చెవుతుండగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం మెటీరియల్ లేదనడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. మరి ఇది సాకుగా పెట్టుకొని రాజమౌళి ఎన్టీఆర్ బర్త్ డే కి అసలు ఫస్ట్ లుక్ వీడియో లేకుండా చేస్తాడా లేదా ఉన్న మెటీరియల్ తో సాదా సీదాగా ఆ వీడియోని ముగిస్తాడా అనే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా మే 20న ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ పై వచ్చే ఫస్ట్ లుక్ వీడియో కోసం గంపెడు ఆశలుపెట్టుకొని ఉండగా రాజమౌళి తాజా వ్యాఖ్యలు నిరాశ కలిగించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు