‘మెగాస్టార్ – అనిల్ రావిపూడి’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

‘మెగాస్టార్ – అనిల్ రావిపూడి’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Apr 26, 2025 11:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ పూర్తి అయింది. చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్ లో చిరంజీవి పాత్రకి ప్రత్యేకమైన యాస మరియు బాడీ లాంగ్వేజ్‌ను అనిల్ రావిపూడి డిజైన్ చేస్తున్నారట. అదేవిధంగా సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారు.

కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. అయితే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు