బన్నీ సినిమాలో సేతుపతి రోల్ ఇలానే ఉంటుందట

బన్నీ సినిమాలో సేతుపతి రోల్ ఇలానే ఉంటుందట

Published on Mar 10, 2020 1:51 PM IST

సుకుమార్, అల్లు అర్జున్ కలిసి కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. శేషాచలం అడవుల్లో జరిగే స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ఇందులో ప్రటినాయకుడిగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నారు. తాజా సమాచారం మేరకు సేతుపతి ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కావడం, రూరల్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథా కావడం, ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

తాజా వార్తలు