ఏపీలో ‘కాంతార 1’ ప్రీమియర్స్ పై కూడా లేటెస్ట్ క్లారిటీ!

ఏపీలో ‘కాంతార 1’ ప్రీమియర్స్ పై కూడా లేటెస్ట్ క్లారిటీ!

Published on Oct 1, 2025 3:00 PM IST

kantara chapter 1

మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ డివోషనల్ చిత్రం కాంతార 1 కూడా ఒకటి. మరి దీనికి ముందు వచ్చిన చిత్రం పెద్ద హిట్ కావడంతో ప్రీక్వెల్ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ఫైనల్ గా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా నిజానికి ఒకరోజు ముందే ప్రీమియర్స్ పడే ఛాన్స్ ఉందని మేము మొదట తెలియజేశాము.

అయితే దాదాపు చివరి వరకు ఈ ప్లాన్ లోనే మేకర్స్ ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో కొన్ని సమస్యలు మూలాన ముందు రోజు ప్రీమియర్స్ ఇపుడు ఒక్క యూఎస్ లో కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా నైజాం లో కూడా వేయడం లేదని తెలిపారు. పోనీ ఏపీలో ఉంటాయి అనుకుంటే అక్కడ కూడా ప్రీమియర్స్ లేనట్టు డిస్ట్రిబ్యూషన్ సంస్థ గీతా వారు తెలిపారు. సో తెలంగాణ, ఏపీ లలో రేపు ఉదయం ఆట నుంచే కాంతార 1 ప్రదర్శితం కానుంది. సో అభిమానులు రేపటి వరకు ఆగక తప్పదు.

తాజా వార్తలు