‘భారతీయుడు 3’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

‘భారతీయుడు 3’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!

Published on Jul 28, 2025 8:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా చేసిన ఎన్నో ఎపిక్ చిత్రాల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేసిన భారీ చిత్రం ఇండియన్ కూడా ఒకటి. తెలుగులో ‘భారతీయుడు’ గా వచ్చి ఇక్కడ కూడా పెద్ద హిట్టయ్యిన ఈ సినిమాకి మేకర్స్ సీక్వెల్ ని గత ఏడాది తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు.

పైగా గట్టి నెగిటివిటీ కూడా వచ్చింది. కానీ ఇప్పటికీ భారతీయుడు 3 కోసం ఎదురు చూస్తున్న వారు కూడా లేకపోలేరు. పార్ట్ 2 వచ్చినప్పుడు కూడా చాలామంది చివరిలో పార్ట్ 3 ట్రైలర్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. దీనితో నేరుగా ఈ సినిమానే తీసుకొస్తే బాగుణ్ణు అనుకున్నారు.

అయితే మధ్యలో నడిచిన చాలా తతంగం తర్వాత శంకర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోనే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం భారతీయుడు 3 ఈ ఏడాది ఆఖరున వచ్చే ఛాన్స్ ఉందట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు