అందాల నటి సౌందర్య అంటే తెలియని వారెవరూ ఉండరు, తన నటనతో మరియు అందంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదిచుకున్న సౌందర్య 8 సంవత్సరాల క్రితం ఒక విమాన ప్రమాదంలో మరణించారు. అలాంటి నటి పేరు ఊహించని కొన్ని విషయాల మీద వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఆమె కుటుంబం సుమారు 50 కోట్లు విలువ చేసే ఆస్తి వివాదంలో వార్తల్లో నిలిచింది.
సౌందర్య భర్త అయిన జి.ఎస్ రఘు మరియు సౌందర్యతో పాటు చనిపోయిన ఆమె తమ్ముడు అమర్ నాథ్ భార్యకి మధ్య ఈ వివాదం జరుగుతోంది. ఈ వివాదంలో సౌందర్య భర్త రఘుకి సౌందర్య తల్లి సపోర్ట్ చేస్తుండగా, అమర్ నాథ్ భార్యకి ఆమె కొడుకు అండగా ఉన్నారు. ఆ ఆస్తిలోఅమర్ నాథ్ కి ఉన్న భాగం తమకు రాకుండా చేసారని అతని భార్య ఫిర్యాదు చేసారు.
మనకున్న సమాచారం ప్రకారం సౌందర్య ఆమె తమ్ముడైన అమర్ నాథ్ మరియు అతని కొడుకు సాత్విక్ పేరు మీద వీలునామా రాసిందని కానీ ఆమె చనిపోయాక సౌందర్య భర్త మరియు సౌందర్య తల్లి కలిసి వీలునామా మార్చేశారని అమర్ నాథ్ భార్య అంటున్నారు. ఈ విషయంపై రెండు పార్టీలు బెంగుళూరులోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు.