గోదారంత ఆశ పెట్టుకున్న లక్ష్మి

గోదారంత ఆశ పెట్టుకున్న లక్ష్మి

Published on Mar 8, 2013 4:03 AM IST

Manchu-Laxmi-Prasanna

లక్ష్మి మంచు మంచి నటనకు మాత్రమే కాకుండా ధైర్యమున్న నిర్మాతగా కుడా పేరు సంపాదిన్చుకంది. గత 18 నెలలుగా ఆమె తాన సర్వసం పెట్టి ‘గుండెల్లో గోదారి’ సినిమా నిర్మిస్తుంది. తప్పక విజయం సాధించాల్సిన ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. తన మునపటి చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’లో మంచి నటీమణిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తనకి డబ్బులని తెచ్చిపెట్టలేకపోయింది. ఈ కష్ష్టం అంతా ‘గుండెల్లో గోదారి’ సినిమాతో తీరిపోతుందని భావిస్తుంది.

మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకి కుమార్ నాగేంద్ర దర్శకుడు. ఈ చిత్రం 1986 లో గోదావరిలో వచ్చిన వరద నేపధ్యంలో తీసారు కనుక ఆ వరద సంఘటన వాస్తవంగా చూపించాలని ఒక సెట్ కూడా వేసారు.

మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో లక్ష్మితో పాటు తప్సీ. ఆది, సందీప్ కిషన్ లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మర్చి 8న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు