లక్ష్మీ మంచు ఎంతో మృదు స్వభావం కలిగి, ఎంతో సున్నితంగా మాట్లాడే నటి మరియు నిర్మాత. ఇండస్ట్రీలోని ఎంతో మందితో సత్సంబందాలు ఉన్న లక్ష్మీ ప్రస్తుతం కోపంగా ఉంది. దానికి కారణం ఒక తమిళ్ సినిమా. విషయంలోకి వెలితే, ‘ ‘గుండెల్లో గోదారి’ చిత్రంలోని తాప్సీ ఫోటోలను ‘పుదువై మనగరం’ అనే తమిళ్ సినిమా పోస్టర్లలో మమ్మల్ని అడగకుండా వాడుకున్నారని, వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని లక్ష్మీ మంచు’ అన్నారు.
‘ నా లీగల్ టీం ఆ చిత్ర తమిళ నిర్మాతలపై యాక్షన్ తీసుకుంటారు. ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో తాప్సీ లుక్ ని మేము ఎంతో కష్టపడి డిజైన్ చేసాము. వాళ్ళు సింపుల్ గా కాపీ కొట్టి వాడుకున్నారు. అది సరైన విధానం కాదని ఆమె’ అన్నారు.
అలాగే లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘ ‘గుండెల్లో గోదారి’ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో విడుదల చేస్తాము. సినిమా చాలా బాగా వచ్చింది మరియు ఈ సందర్భంగా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన మాస్ట్రో ఇళయరాజా గారికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరో రెండు వారాల్లో ఈ చిత్ర ఆడియోను విడుదల చేస్తామని’ ఆమె అన్నారు.