అల్లరి నరేష్ తాజా చిత్రం ‘లడ్డు బాబు’ ఆడియో మార్చి 17 న హోటల్ మారియోట్ లో విడుదల కానుంది. రవి బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో పూర్ణ భూమిక చావ్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రచయిత త్రిపురనేని మహారధి తనయుడు రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘లడ్డు బాబు’ చిత్రం ఒక భారీ కాయుడి పెళ్లి ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. తన కెరీర్ లో తొలిసారిగా అల్లరి నరేష్ ఇటువంటి పాత్ర ని పోషిస్తున్నారు. ఈ పాత్ర లుక్ సరిగ్గా వుండడం కోసం ఎంతో మేక్అప్ చేయించుకున్నారు. యు.కె నుండి వచ్చిన కొంత మంది మేక్ అప్ ఆర్టిస్ట్ లు ఈ పూర్తి వినోదాత్మక చిత్రం కోసం పని చేసారు. “ఈ చిత్రం ఒక సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతుంది మేము లావుగా ఉన్నవారిని అవహేళన లేదు ” అని రవి బాబు ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పనులని పూర్తి చేసుకుని యు/ఎ సెర్టిఫికట్ పొందింది. ‘లడ్డు బాబు’ వేసవి లో విడుదల కానుంది.