విడుదలైన లడ్డూబాబు ఆడియో

విడుదలైన లడ్డూబాబు ఆడియో

Published on Mar 18, 2014 12:19 AM IST

Laddubabu
అల్లరి నరేష్ నటిస్తున్న లడ్డూబాబు సినిమా ఆడియో ఈరోజు హైదరాబాద్ లో ఒక స్టార్ హోటల్ లో విడుదలైంది. అల్లు అరవింద్, నాని, సందీప్ కిషన్, గోపి చంద్ మలినేని, భీమినేని శ్రీనివాస రావు, రవి బాబు, అల్లరి నరేష్, చక్రి, పూర్ణ మొదలగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు

ఈ సినిమా ఆడియో ని విడుదల చేసిన అల్లు అరవింద్ ఇంత వైవిధ్యమైన కధతో ముందుకొచ్చిన రవిబాబు, అల్లరి నరేష్ లను పొగిడారు. ఈ వేడుకకు హై లైట్ ఏమిటంటే నరేష్ లడ్డూబాబు సినిమాలో గెట్ అప్ తో వచ్చి అందరినీ అలరించాడు. తన కెరీర్ లో మొదటిసారి ఇటువంటి పాత్ర చేస్తున్న నరేష్ కు మేక్ అప్ కోసం విదేశాలనుండి నిపుణులను తెప్పించారు

ఈ సినిమాలో భూమిక ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది. చక్రి సంగీత దర్శకుడు. రాజేంద్ర త్రిపురనేని నిర్మాత

తాజా వార్తలు