కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘లడ్డూబాబు’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. రవిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూర్ణ, భూమిక చావ్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. దాన్ని చూసిన అందరూ ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ గురించి రవిబాబు ఒక కొత్త వెర్షన్ చెప్పాడు.
‘లడ్డూబాబు చాలా ఫన్నీగా ఉంటూనే సున్నితమైన కథాంశంతో మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాలో పొట్ట చెక్కలెయ్యెలా కామెడీ ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారని నేను అనుకోను ఎందుకంటే మా హీరో ఫాట్ బాయ్. ఒక ఫాట్ మాన్ – ఓ యంగ్ మాన్ మధ్య జాగే కథే ఈ సినిమా అని’ రవిబాబు అన్నాడు. అల్లరి నరేష్ ఈ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు. బాగా లావుగా ఉన్న వ్యక్తికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం కాస్త కష్టమైన పననే చెప్పాలి.
రవిబాబు గతంలో అందించిన ‘అవును’, ‘నువ్విలా’, ‘నచ్చావులే’, ‘అనసూయ’ లాంటి సినిమాల్లో హీరో, హీరోయిన్ ల పాత్రలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సారి ఆయన ఓ సున్నితమైన అంశాన్ని డిఫరెంట్ గా చూపించనున్నాడు. ఈ సారి ఎంతవరకూ ప్రేక్షకులని మెప్పిస్తాదనె చూడాలి. చక్రి ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు.