అక్టోబర్ 3న కృష్ణం వందే జగద్గురు ఆడియో విడుదల

అక్టోబర్ 3న కృష్ణం వందే జగద్గురు ఆడియో విడుదల

Published on Sep 29, 2012 9:04 AM IST

రానా రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” ఆడియో అక్టోబర్ 3న విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరియు నయనతారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో స్వార్థపరుడు అయిన బి.టెక్ బాబుగా కనిపించే రానా డ్యాకుమెంటరిలు తీసుకునే నయనతారను కలిసాక ఏం జరిగింది అన్న అంశం మీద ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తయ్యింది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం తమిళంలో కూడా తెరకెక్కించబడింది ఈ చిత్రం తమిళంలో రానా ఆరంగేట్రంగా ఉండబోతుంది. గతంలో క్రిష్ అక్కడ “వేదం” చిత్రాన్ని రీమేక్ చేశారు. నయనతార తమిళంలో ఒకానొక ప్రధాన తార. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా వి ఎస్ జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఈ చిత్రం అక్టోబర్ చివరి వారంలో విడుదల కానుంది.

తాజా వార్తలు