రానా సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్

రానా సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్

Published on Oct 8, 2012 12:04 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్ర ఆడియో వేడుక నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రానికి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే క్రిష్ దర్శకత్వం వహించారు. అందాల భామ నయనతార రానా సరసన కథానాయికగా నటించారు.

మైనింగ్ మాఫియా నేపధ్యంలో పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న సోషియో ఎకనమిక్ సమస్యను గురించి కూడా చూపించారు. జె.సాయి బాబు మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు.

‘కృష్ణం వందే జగద్గురుమ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది ఫ్రెండ్స్? మీకందరికీ నచ్చిందా?

Click Here To Watch Trailer

తాజా వార్తలు