వినూత్న కథ కథనాలతో ‘క్షీరసాగర మథనం’ !

వినూత్న కథ కథనాలతో ‘క్షీరసాగర మథనం’ !

Published on Mar 5, 2020 2:48 PM IST

ఐ.టి రంగం నుంచి సినిమా దర్శకత్వంలోకి వచ్చినవాళ్లంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలో ‘అనిల్ పంగులూరి’ అనే మరో పేరు చేరుతోంది. ఓ ప్రఖ్యాత బహుళ జాతీయ సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్న అనిల్ ‘క్షీరసాగర మథనం’ పేరుతొ ఓ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు నవలా రారాణిగా అలరారిన యద్దనపూడి సులోచనారాణికి ఈయన స్వయంగా మనవడు కావడం విశేషం. మానస్ నాగులపల్లి (కాయ్ రాజా కాయ్ ఫేమ్), ‘పిట్టకథ’ ఫేమ్ సంజయ్ రావ్, హీరోలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నెడ్ డైరెక్టర్ అనిల్ పంగులూరి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి.. తన గురించి.. తన సినిమా ‘క్షీర సాగర మథనం’ గురించి పలు విషయాలు వెల్లడించారు.

మాది ఒంగోలు. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రఖ్యాత నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మా అమ్మమ్మగారు కావడంతో చిన్నప్పటి నుంచి సాహిత్యంలోనూ ప్రవేశం ఉండేది. ఎం.బి.ఏ తర్వాత ఐ.టీలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. కొన్నాళ్ళు.. అమెరికా, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియాలోనూ పని చేశాను. అశోక్ దర్వకత్వంలో రూపొంది అనూహ్య విజయం సాధించిన ‘పిల్ల జమీందార్, సుకుమారుడు’ చిత్రాలతోపాటు, నా మిత్రుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సుమంత్ హీరోగా రూపొందిన ‘ఇదం జగత్’ చిత్రాల రూపకల్పనను చాలా దగ్గర నుంచి పరిశీలించి.. సినిమా మేకింగ్ పై కొంతమేర అవగాహన కలిగించుకున్నాను. ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్న నేను.. స్వయంగా దర్శకత్వం, నిర్మాణం చేపట్టాను. అప్పటికే నేను నా కథను కనీసం ఓ వంద మందికి చెప్పెను. వాళ్ళల్లో ఏ ఒక్కరూ కథ బాలేదని చెప్పలేదు. దాంతో ఎవరి చుట్టో తిరగడం ఎందుకని.. నా ఫ్రెండ్స్ తో కలిసి ‘క్షీర సాగర మథనం’ చిత్రానికి శ్రీకారం చుట్టాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రఖ్యాత ఐ.టి కంపెనీల్లో పని చేస్తున్న నా మిత్రులు ఓ 20 మంది ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్నారని చెప్పడానికి గర్వపడతాను. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరికీ నచ్చే చిత్రమిది. అందరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ల వరకు అందరికీ నచ్చే సినిమా. ‘క్షీర సాగర మథనం’తో దర్శకుడిగా నాకు వచ్చే పేరు చెడగొట్టుకోకుండా.. దాన్ని పెంచేలా ఉండేలా మంచి కథ సిద్ధం చేశాను. ‘క్షీర సాగర మథనం’ 25 డేస్ ఫంక్షన్ లో నా నెక్స్ట్ సినిమా డిటైల్స్ అనౌన్స్ చేస్తాను.

తాజా వార్తలు