తెలుగు కల్చర్ పై ఫోకస్ పెట్టిన దర్శకేంద్రుడు

తెలుగు కల్చర్ పై ఫోకస్ పెట్టిన దర్శకేంద్రుడు

Published on May 26, 2013 9:20 PM IST

Intinta-Annamayya
దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా ఆయన గత చిత్రాల కంటే కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తీసిన అన్నమయ్య, శ్రీ రామదాసు, పాండురంగడు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను ఫేమస్ గాయకులూ, గురువుల మీద తీసారు. ప్రస్తుతం తీసిన ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమాలో తెలుగు కల్చర్ యొక్క గొప్పదనం మీద ఫోకస్ చేసాడు. ఈ సినిమా ప్రతి పోస్టర్ పైన ‘తెలుగు భాష.. తెలుగు పాట.. తెలుగు యువత’ అని ఉంటుంది. రేవంత్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో సింగర్, మ్యుజిషియన్ గా కనిపించనున్నాడు.

సనం శెట్టి, అనన్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సనం శెట్టి తెలుగు కల్చర్ అంటే ఇష్టం లేని ఓ ఎన్నారై, అలాంటి అమ్మాయిని హీరో తెలుగు కల్చర్ గురించి, అన్నమయ్య కీర్తనల గురించి చెప్పి ఎలా మార్చాడు అనేదే కథాంశం. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని జూన్ 14న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాని మే 31 న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ రిలీజ్ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. యలమంచలి సాయిబాబు ఈ సినిమాకి నిర్మాత.

తాజా వార్తలు