ఆ దర్శకుడికి బ్రహ్మానందానికి ప్రత్యుమ్న్యాయం దొరికిందట

ఆ దర్శకుడికి బ్రహ్మానందానికి ప్రత్యుమ్న్యాయం దొరికిందట

Published on Apr 3, 2013 4:06 AM IST

nani-krishna-vamsi

కృష్ణ వంశీ తన 15ఏళ్ళ కెరీర్లో చాలా మంది యువ ఆర్టిస్ట్ లను పరిచయం చేసాడు. ఇప్పుడు తన తాజా సినిమా ‘పైసా’లో ఒక కొత్త ప్రతిభ కలిగిన కమెడియన్ ని పరిచయం చేయనున్నాడు. అతని పేరు తబార్. ఇతను ఇప్పటికే కొన్ని చిన్న చిన్న హైదరాబాద్ చిత్రాలలో నటించాడు. మన డైరెక్టర్ కి ఇతను తెగ నచ్చేసాడట. ఎంతలా అంటే ఏకంగా బ్రహ్మానందానికే ప్రత్యుమ్న్యాయంగా పెట్తెసాడట. “సెట్లో తబార్ ఫాన్స్ తాకిడి తట్టుకోవడం చాలా కష్టం అయ్యింది. ఈ సినిమాలో అతను నాని ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడని” కృష్ణ వంశీ చెప్పాడు. ఈ సినిమాలో అతని యాస చాల విచిత్రంగా ఉంటుందట.

‘పైసా’ సినిమా దాదాపు పూర్తయింది. ఈ వేసవి చివర్లో విడుదల కానుంది. నాని, కేథరిన్ త్రెసా హీరో, హీరోయిన్స్. సిద్ధిక శర్మ రెండో హీరొయిన్. ఈ పొలిటికల్ డ్రామాలో చరణ్ రాజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. రమేష్ పుప్పాల ఈ సినిమాని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు