విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావును, అల్లు రామలింగయ్య కళాపీఠం అవార్డు 2013గాను వరించింది. పోయిన సంవత్సరం ఈ తనికెళ్ళ భరణి అందుకున్నారు. ఈరోజు సాయింత్రం ఈ వేడుక రవీంద్రభారతిలో జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ ఈ సభకు హాజరయ్యి కోటా ను సత్కరించారు. కోట మాట్లాడుతూ తాను ఎప్పుడూ అల్లు రామలింగయ్య గారిని రోల్ మోడల్ గా తీసుకుని ఆయన్ని చూస్తూ పెరిగానని నిజానికి అల్లు ప్రభావం తనపై చాలా వుందని చెప్పి, ఈ అవార్డును జ్యూరి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి, అల్లు అర్జున్ సభకు రావడంతో అభిమానులు సందడి చేసారు