మెగాస్టార్ ‘ఆచార్య’ దసరాకే ఫిక్స్ అట ?

మెగాస్టార్ ‘ఆచార్య’ దసరాకే ఫిక్స్ అట ?

Published on Apr 17, 2020 11:48 PM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఆచార్య. కాగా కొరటాల శివ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్తూ.. ఆచార్య షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. దసరా పండుగ సీజన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇప్పటికే ఆ పాట‌ను షూట్ చేశారు. పాట చాల బాగా వచ్చిందట. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు