బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న కోన వెంకట్

బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న కోన వెంకట్

Published on Feb 9, 2014 9:30 AM IST

Kona-Venkat
ప్రస్తుతం టాలీవుడ్ లో రైటర్ గా బిజీగా ఉన్న కోన వెంకట్ త్వరలోనే తన స్వీయ దర్శకత్వంలో తెరెకెక్కిన ‘రామ్ & జూలియట్’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రసుతం మరికొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘పవర్’ సినిమా స్క్రిప్ట్ కోసం ఎస్. రవీంద్రతో కలిసి పనిచేసాడు. అలాగే తను పనిచేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

తాజా సమాచారం ప్రకారం కోన వెంకట్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకి కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. అభిషేక్ బచ్చన్ నటించనున్న ఓ సినిమాకి కోన వెంకట్ సైన్ చేసాడు. ‘అభిషేక్ బచ్చన్ సినిమాకి సైన్ చెయ్యడం హ్యాపీగా ఉంది. ఈ సబ్జెక్ట్ అందరికీ సర్ప్రైజ్ నడ షాక్ ఇచ్చేలా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటి సారని’ కోన వెంకట్ ట్వీట్ చేసాడు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇది కాకుండా కోన దర్శకత్వం వహించిన ‘రామ్ & జూలియట్’ సినిమా ఆడియోని ఫిబ్రవరి 14న అందాల భామ సమంత చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు