భారీ అనౌన్స్మెంట్ అంటున్న కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.!

మన టాలీవుడ్ లో పలు భారీ నిర్మాణ సంస్థలలానే కోలీవుడ్ లో కూడా కొన్ని భారీ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మరి అలాంటి వాటిలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ కూడా ఒకటి. కోలీవుడ్ లో స్టార్ హీరోలు చాలా మందితోనే భారీ బడ్జెట్ సినిమాలను తీసిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఒక భారీ అప్డేట్ తో ముందుకు వస్తున్నట్టుగా తెలుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆ అప్డేట్ ను రివీల్ చెయ్యనున్నట్టుగా తెలిపారు.

మరి ఆ అప్డేట్ ఏంటా అని అటు తమిళ్ మరియు మన తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వీరు ఎలాంటి అనౌన్సమెంట్ ను తెలియజేస్తారో చూడాలి. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణ సంస్థనే మన బిగ్గెస్ట్ యాక్షన్ ప్రాజెక్ట్ “RRR” హక్కులను కొన్నారని తెలిసింది.అందుకు తగ్గట్టుగానే నిప్పు నీరు ఎమోజీస్ తో హింటిచ్చారు.సో దాదాపు ఈ చిత్రానికి సంబంధించిందే కావచ్చు. మరి వారేం చెప్తారో చూడాలి.

Exit mobile version