కో అంటే కోటి చిత్రానికి “A” సర్టిఫికేట్

కో అంటే కోటి చిత్రానికి “A” సర్టిఫికేట్

Published on Dec 27, 2012 9:16 AM IST

KO-ANTEY-KOTI-(3)
శర్వానంద్ ప్రధాన పాత్రలో రానున్న “కో అంటే కోటి” చిత్రం సెన్సార్ బోర్డు నుండి “A” సర్టిఫికేట్ అందుకుంది. ఈ చిత్రం జనవరి 28న విడుదల కానుంది. ఈ చిత్రంలో హింస మరియు కొంత అసభ్యకరమయిన భాషను దృష్టిలో ఉంచుకొని “A” సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ మరియు అమెరికాలో విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాత శర్వానంద్ ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల చేస్తున్నారు. అనీష్ కురువిల్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందించారు. ప్రియ ఆనంద్ కథానాయికగా నటించగా శ్రీహరి కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు