కిష్కింధపురి సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ అదిరింది..!

కిష్కింధపురి సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ అదిరింది..!

Published on Sep 2, 2025 6:59 PM IST

Kishkindhapuri

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హారర్ జోనర్ చిత్రం ‘కిష్కింధపురి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తుండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి మరో ట్రీట్ అందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు 2 గంటల 5 నిమిషాల రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ హారర్ జోనర్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు