24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

Published on Jul 26, 2025 5:00 PM IST

Kingdom

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఇక ఈ సినిమాకు యూఎస్ ప్రీమియర్స్ రూపంలో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రానికి ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్‌లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు అక్కడ ఎలాంటి క్రేజ్ నెలకొందో ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. గడిచిన 24 గంటల్లో ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ కోసం ఏకంగా 10వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ రూపంలో సాలిడ్ రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు