అక్కడ ‘కింగ్డమ్’ టికెట్ బుకింగ్స్ షురూ అయ్యేది ఈ రోజునే..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా మేకర్స్ రూపొందించడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా, కింగ్డమ్ చిత్రం కోసం ఇండియన్ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో విజయ్ దేవరకొండ సినిమాలకు ఉండే ఆదరణ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. దీంతో ఇప్పుడు ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టికెట్ బుకింగ్స్‌ను జూలై 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తితో ఈ చిత్రాన్ని ముందురోజే వీక్షించేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Exit mobile version