‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్‌లో టీమ్ కాన్ఫిడెంట్.. ఏమన్నారంటే..?

‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్‌లో టీమ్ కాన్ఫిడెంట్.. ఏమన్నారంటే..?

Published on Jul 27, 2025 2:00 AM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.

‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “గత సంవత్సర కాలంగా ‘కింగ్‌డమ్’ గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “నేను చేసింది ఒక్క సినిమానే అయినా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. దర్శకుడు గౌతమ్ గారు ‘కింగ్‌డమ్’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండ గారికి తన వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టాన్ని త్వరలో ప్రేక్షకులు స్క్రీన్ పై చూడబోతున్నారు. అనిరుధ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీ గారు ఒకే సమయంలో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా.. ప్రతి సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. జూలై 31న విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ మీ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ ‘కింగ్‌డమ్’ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. నేను, గౌతమ్ 2018లో జెర్సీ సినిమా చేసి జాతీయ అవార్డు అందుకున్నాం. ఆ తర్వాత గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఇది. రెండున్నరేళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాని చూపించబోతున్నాము. మీరు ట్రైలర్ లో చూసింది శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ గారి అభిమానులు గత నాలుగైదు సంవత్సరాలలో ఏం మిస్ అయ్యారో.. ఆ ఇంటెన్సిటీ ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ గారి కళ్ళలో ఏ ఇంటెన్సిటీ చూశారో.. అది ఇందులో ఉంటుంది. విజయ్ గారి కోసం నేను, గౌతమ్ 100 శాతం ఎఫర్ట్ పెట్టి.. మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. జూలై 31 విడుదలవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.”

మొత్తానికి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అందరూ ఈ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై వారు ఎంత నమ్మకంగా ఉన్నారో స్పష్టమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు