నైజాంలో ‘కింగ్డమ్’ 3 రోజులు వసూళ్లు ఎంతంటే!

నైజాంలో ‘కింగ్డమ్’ 3 రోజులు వసూళ్లు ఎంతంటే!

Published on Aug 3, 2025 11:40 AM IST

Kingdom

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే కింగ్డమ్.ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇలా నైజాం మార్కెట్ లో కింగ్డమ్ మంచి వసూళ్ళతో దూసుకెళ్తుంది.

మొత్తం మూడు రోజుల రన్ ను కంప్లీట్ చేసుకున్న కింగ్డమ్ ఈ మూడు రోజుల్లో 7.85 కోట్ల షేర్ వచ్చినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. అది కూడా జి ఎస్ టీ కాకుండా అట. నిన్న ఒక రోజుకే 1.8 కోట్ల షేర్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. ఇలా వీకెండ్ కి మాత్రం మంచి హోల్డ్ తో కింగ్డమ్ వెళుతుంది. ఇక ఈ ఆదివారం కూడా మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

తాజా వార్తలు