ఆ క్రేజీ మల్టీస్టారర్ లో కియారా అద్వానీ ?

ఆ క్రేజీ మల్టీస్టారర్ లో కియారా అద్వానీ ?

Published on Jan 31, 2021 8:49 PM IST

దర్శకుడు సందీప్ వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, అదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కాగా సందీప్ తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ‏తో చేయబోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు అనీల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీగా రానున్న ఈ సినిమాకి ‘యానిమల్’ అనే టైటిల్ కూడా పెట్టారు. కాగా ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది.

అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా గెస్ట్ రోల్ లో నటించబోతుందట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుంది. క్రేజీ కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఇప్పటికే ప్రీ-లుక్ టీజర్ లో రణబీర్ కపూర్ వాయిస్ తో బ్యాక్ డ్రాప్ లో కథను కూడా వినిపించారు కూడా. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని ప్రీ-లుక్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. అక్కడి నిర్మాతలు సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు