“కేజీయఫ్ 2” బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేది అప్పుడేనా.?

మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. చాప్టర్ 1 అంచనాలకు మించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకొనే సరికి చాప్టర్ 2 పై అంతకు మించిన అంచనాలు నెలకొన్నాయి.

దీనితో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ కరోనా వల్ల వాయిదా పడాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ఒక్క బర్త్ డే పోస్టర్స్ తప్ప బిగ్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. దీనితో అలాంటి ఒక అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం ఆ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చే డిసెంబర్ నెలలో ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ దీపావళికి వారి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ఉండదని టాక్. చాలా కాలం నుంచి టీజర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఎలాగో జనవరిలో అది ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి బహుశా మేకర్స్ దాని పైనే డిసెంబర్ లో చెప్తారేమో చూడాలి.

Exit mobile version