రాఖీ భాయ్ భీభత్సం మొదలయ్యేది ఆరోజే

రాఖీ భాయ్ భీభత్సం మొదలయ్యేది ఆరోజే

Published on Jan 29, 2021 9:45 PM IST

కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కెజిఎఫ్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ చిత్రం. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచడంతో విడుదల మీరు అందరి దృష్టి పడింది.

జూలై 16వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఇతర సినిమాలతో క్లాష్ అవకుండా అన్ని విధాలుగా ఆలోచించి ఈ తేదీని ఫైనల్ చేశారు. ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో చిత్రం విడుదలకానుంది. సినిమా కోసం అన్ని పరిశ్రమల నుండి స్టార్ నటీనటుల్ని తీసుకున్నారు. ఇందులో సంజయ్ దత్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా మరొక హిందీ నటి రవీనా టాండన్ ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. తెలుగు నుండి రావు రమేష్ ఇందులో ఒక కీలకమైన పాత్ర పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు