సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పాన్ ఇండియా నుంచి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలా ఉంటుందా అని అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే లోకేష్ కనగరాజ్ సినిమాలకి ప్రమోషన్స్ దాదాపు ఇంటర్వ్యూస్ తోనే గడిచిపోతాయి. కానీ ఇప్పుడు కూలీ కోసం అంతకు మించి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.
కూలీ పోస్టర్స్ ఇప్పుడు పలు అమెజాన్ డెలివరీ కొరియర్స్ పై కనిపిస్తున్నాయి. దీనితో ఈ రకంగా కూడా ప్రమోషన్స్ చెయ్యొచ్చా అని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం కూలీ ఒక సరికొత్త ఐడియా అందించింది అని చెప్పవచ్చు. ఇక దీనిపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వదిలారు. అలాగే అవైటెడ్ కూలీ ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా తెలుగు, తమిళ్, హిందీ అలానే కన్నడ లో కూడా విడుదల కాబోతుంది.
The first time ever for an Indian movie!????#Coolie Promotions in full swing across India ! ????#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/Cv30HD0MyQ
— Pen Movies (@PenMovies) July 30, 2025