జూన్ 2న కెవ్వు కేక ఆడియో

జూన్ 2న కెవ్వు కేక ఆడియో

Published on May 27, 2013 8:25 PM IST

Kevvu-Keka
అల్లరి నరేష్ తదుపరి సినిమా ‘కెవ్వు కేక’ ఆడియో జూన్ 2న హైదరాబాద్లో విడుదలకానుంది. బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ ప్రసాద్ దర్శకుడు. కన్నడ నటి షర్మిలా మాండ్రే తెలుగు తెరకు ఈ సినిమా ద్వారా పరిచయంకానుంది. ఈ మధ్యే హీరో, హీరొయిన్ల నడుమ ఒక పాటను చిత్రీకరించడంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. బ్యాంకాక్లో నివసిస్తున్న తెలుగు ప్రజల నడుమ సాగే నేపధ్యంలో ఈ సినిమా కధ నడుస్తుంది. అల్లరి నరేష్ గత సినిమాలలాగే ఈ సినిమా కూడా కడుపుబ్బ నవ్వించడానికి సిద్దమయ్యింది. భీమ్స్, చిన్ని చరణ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జూన్ చివర్లో విడుదలకావచ్చు

తాజా వార్తలు