‘అలిమేలు మంగ’గా కీర్తి సురేష్ ఫిక్స్ ?

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ ‘ఒక హీరో’గా చేస్తోన్న మొదటి సినిమా ఇది. కాగా తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట.

అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారని కాజల్‌, అనుష్క ఇద్దరిలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలని వాళ్ళు అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని తేజ ఫీల్ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమా చిత్రీకరణలు మొదలయ్యే నాటికి కాజల్, అనుష్క ఖాళీగా ఉండాలి. బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి.

ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. అనుష్క కూడా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవట్లేదు. అందుకే తేజ మరో హీరోయిన్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. గతంలో కూడా కీర్తి సురేష్ను తీసుకుంటునట్లు వార్తలు వచ్చినా తాజాగా ఆమెనే ఫైనల్ చేసినట్టు సమాచారం.

Exit mobile version