అలనాటి అందాల తార రాధ పెద్ధ కూతురు కార్తీక దాదాపు రెండేళ్ళ విరామం తరువాత మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. దమ్ము సినిమాలో ఎన్.టి.ఆర్ త్రిషలతో కలిసి నటించింది. గత యేడాది చిన్న కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంతకం చేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనుంది
ఈ సినిమాకు లో తన పాత్ర ‘అమేజింగ్’ అని తెలిపింది. ఆ పాత్ర దక్కడం తన అదృష్టమట. రామోజీ ఫిల్మ్ సిటిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే కార్తీక నార్త్ ఇండియా లో తన తమిళ సినిమా పురంపొక్కు షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో ఆర్య, విజయ్ సేతుపతి హీరోలు
చిన్న కృష్ణ గతంలో వీడు తేడా సినిమా తీశారు. ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు