తమిళ్ హీరో కార్తీ – కాజల్ అగర్వాల్ జంటగా రెండవసారి కలిసి నటిస్తున్న తమిళ సినిమా ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజా’. వీళ్ళిద్దరూ సుసీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్ మహాన్ అల్లా’ సినిమాకోసం మొదటి సారి జోడీ కట్టారు. ఈ సినిమా తెలుగులో ‘నా పేరు శివ’ గా విడుదలైంది. ఎం. రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజు’ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు.
ఇటీవలే చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా ఎక్కువ భాగం పొల్లాచ్చి, తెన్ కాశీ, మరికొన్ని సౌత్ చెన్నై లోకేషన్స్ లో షూట్ చేయనున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు. ఇది కాకుండా కార్తీ, అనుష్క నటించిన ‘అలెక్స్ పాండ్యన్’ సినిమా తెలుగులో ‘బ్యాడ్ బాయ్’ పేరుతో మార్చి 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.