అన్నయ్యకి డబ్బింగ్ చెప్పనున్న తమ్ముడు

అన్నయ్యకి డబ్బింగ్ చెప్పనున్న తమ్ముడు

Published on Sep 30, 2012 6:50 PM IST


తమిళ హీరో సూర్య హీరోగా, కె.వి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రదర్స్’. ఈ చిత్రంలో సూర్య పాత్రకి కార్తీ (సూర్య తమ్ముడు) డబ్బింగ్ చెప్పనున్నారు. అదేంటి ఈ చిత్రంలో మొదటిసారిగా తన పాత్రకి సూర్యనే డబ్బింగ్ చెపుతున్నారని చెప్పారు కదా ఇప్పుడు కార్తీ అంటున్నారేంటా అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో సూర్య అవిభక్త కవలుగా నటిస్తున్నారు. ఇందులో ఒక పాత్రకి సూర్య డబ్బింగ్ చెబుతున్నారు, మరో పాత్రకి కార్తీని డబ్బింగ్ చెప్పమని కె.వి ఆనంద్ కోరడంతో కార్తీ అంగీకరించాడని సమాచారం. కార్తీ తెలుగులో తన డబ్బింగ్ చిత్రాలకు తనే డబ్బింగ్ చెప్పుకుని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెట్ ను పెంచుకున్నారు. ఇప్పుడు అదే బాటలోకి తన అన్నయ్య సూర్య కూడా వచ్చి తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో డబ్బింగ్ చేసి, స్వయంగా తనే ఆంధ్రప్రదేశ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు