కార్తి దంపతులకు కూతురు జననం

Karthi
తమిళ నటుడు కార్తికి ఈరోజు గుర్తుండిపోయే రోజు. అయన నటించిన “అలెక్స్ పాండియన్” చిత్రం విడుదల అవ్వడమే కాకుండా మరో విశేషం కూడా ఉంది. కార్తి దంపతులకు ఈరోజు కూతురు జన్మించింది. ఈ సందర్భంగా తమిళ పరిశ్రమలో పలువురు పెద్దలు కార్తి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అలెక్స్ పాండియన్ చిత్రం తెలుగులో “బాడ్ బాయ్” గా రానుంది. కార్తి మరియు అనుష్క ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ కి సురాజ్ దర్శకత్వం వహించారు.

Exit mobile version