బిగ్ బాస్ లో ఉన్న నటి సంజనా గల్రాని ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె మాదక ద్రవ్యాల పంపిణీ, విక్రయానికి సంబంధించి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సంజనాతో పాటు మరికొందరికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తాఖీదులు జారీ చేసింది. వారిపై ఉన్న కేసులను కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే కొట్టి వేసిన సంగతి తెలిసిందే. దాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, సంజనా ఫోన్ కాల్స్, చరవాణిలోని వివరాలు, నగదు లావాదేవీలు, మాదక ద్రవ్యాలు విక్రయించే నైజీరియన్ వ్యాపారితో సంబంధాలను ఉన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని, కాబట్టి, పూర్తి విచారణ జరగాల్సిందే అని అదనపు అడ్వకేట్ జనరల్ అమన్ పన్వర్ తన వాదనలను గట్టిగా వినిపించారు. దీంతో, ఆక్షేపణలకు అవకాశం కల్పిస్తూ సంజనకు, ఇతరులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.