స్లో అయ్యిన ‘కాంతార 1’ వసూళ్లు!?

స్లో అయ్యిన ‘కాంతార 1’ వసూళ్లు!?

Published on Oct 11, 2025 9:03 AM IST

Kantara-Chapter-1

రీసెంట్ గా పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న అవైటెడ్ చిత్రమే కాంతార చాప్టర్ 1. నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ లో తెరకెక్కించిన ఈ చిత్రం రిషబ్ శెట్టి కెరీర్ లోనే కాకుండా కన్నడ సినిమా దగ్గర భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. మరి మొదటి వారం పూర్తి చేసుకున్నప్పటికే 500 కోట్ల మార్క్ ని కొట్టేసిన ఈ సినిమా కొన్ని చోట్ల మాత్రం ఊహించిన రేంజ్ పెర్ఫామెన్స్ ని చేయట్లేదా అనిపిస్తుంది.

ఇండియా వైడ్ గా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఓకే కానీ యూఎస్ మార్కెట్ లో మాత్రం కాంతార వసూళ్లు మరింత స్లో అయ్యినట్టు తెలుస్తుంది. నార్త్ అమెరికాలో కాంతార 1 చిత్రం 3 మిలియన్ వరకు బాగానే పెర్ఫామ్ చేసింది కానీ అక్కడ నుంచి స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి టార్గెట్ ని సినిమా రీచ్ అందుకోవడం అనేది చాలా కష్టమే అన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుంది అనేది.

తాజా వార్తలు