రౌడీతో రాజు గారు ఫిక్స్.. కొబ్బరికాయ కొడుతున్నారు..!

రౌడీతో రాజు గారు ఫిక్స్.. కొబ్బరికాయ కొడుతున్నారు..!

Published on Oct 11, 2025 1:00 AM IST

Vijay-Devarakonda-and-Dil-R

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో కొంతవరకు వర్కవుట్ అయింది.

అయితే, ఇప్పుడు విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోతున్న 59వ చిత్రంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తో పాటు దిల్ రాజు కూడా మంచి హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ సినిమాను రవి కిరణ్ కొల్ల అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు