సమీక్ష : అరి – కొన్ని చోట్ల మెప్పించే మైథలాజికల్ డ్రామా !

సమీక్ష : అరి – కొన్ని చోట్ల మెప్పించే మైథలాజికల్ డ్రామా !

Published on Oct 10, 2025 6:22 PM IST

విడుదల తేదీ : అక్టోబర్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు.
దర్శకుడు : వి.జయశంకర్,
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారం రెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి.
సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రాఫర్ : కృష్ణ ప్రసాద్
సమర్పణ : ఆర్ వీ రెడ్డి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

వి.జయశంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరి. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

అరిష‌డ్వ‌ర్గాలలోని కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుట్టూ ఈ క‌థ నడిచింది. విప్రనారాయణ(సాయి కుమార్) కోట్లు సంపాదించి తన ఫ్యూచర్ జనరేషన్ కూడా తన లాగే ఉండాలని ఆశ పడతాడు. ఆత్రేయి (అనసూయ) తన కోలిగ్ అవ్య తన కంటే జాబ్ లో ఎదుగుతుందని జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. లక్ష్మీ (సురభి ప్రభావతి) చనిపోయిన తన భర్త కోసం ఆరాట పడుతూ ఉంటుంది. అమూల్ (వైవా హర్ష) సన్నీలియోన్ అంటే పడిచస్తాడు. సన్నీ కోసం అమూల్ ఏం చేశాడు ?, అలాగే.. శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్ పాత్రలు తమ కోరికల కోసం ఏం చేశాయి ?, అసలు వీరందరి కోరికలను తీరుస్తా అన్న వ్యక్తి ఎవరు ?, వీళ్ళందరికీ టాస్క్ లు ఇచ్చిన ఆ వ్యక్తికి ఈ కథకు ఏమిటి సంబంధం?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అరిష‌డ్వ‌ర్గాలలోని కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుట్టూ తిరిగే కథ.. ఆ కథకు సంబంధించిన టాస్క్ లు.. అలాగే మరోవైపు మిగిలిన పాత్రల ట్రాక్.. ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘‘అరి’’ సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఇంటర్వల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ వంటివి సినిమాకి ప్లస్ అయ్యాయి. అలాగే, సినిమా ముగింపులో రివీల్ చేసిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు తగ్గట్లు చాలా బాగా నటించారు. ముఖ్యంగా సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ పాత్రలు బాగున్నాయి. వైవా హర్ష పాత్రలోని కామెడీ టచ్ వర్కౌట్ అయింది. అలాగే, మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్రల నటన కూడా ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

‘’అరి’ సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం, కథనంలో కూడా కొన్ని చోట్ల రెగ్యులర్ గానే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనెక్ట్ కావు.

అయితే, దర్శకుడు వి.జయశంకర్ దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా వి.జయశంకర్ రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథనంలో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి వి.జయశంకర్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేసి.. మళ్లీ అర్థవంతమైన ముగింపుతో సినిమాని ముగించాడు.

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు వి.జయశంకర్ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. శివశంకర వరప్రసాద్ వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాతలు శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారం రెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘అరి’ అంటూ వచ్చిన ఈ మైథలాజికల్ థ్రిల్లింగ్ డ్రామా.. కొన్ని చోట్ల మెప్పించింది. అలాగే, మెయిన్ కాన్సెప్ట్ అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ సీన్స్ మరియు క్లైమాక్స్ బాగున్నాయి. ఐతే, కథనం స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ థీమ్ అండ్ కొన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్, క్లైమాక్స్ కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు