టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిత్ర మండలి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం హీరో హీరోయిన్లుగా నటించగా విజయేందర్ దర్శకత్వం వహించారు. బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా.విజేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇక ఈ చితర రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు.
‘మిత్ర మండలి’ జర్నీ ఎలా ప్రారంభమైంది..?
బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. గీతా ఆర్ట్స్‌లో మేం చాలా కాలం ఆయనతో పాటుగా పని చేశాం. వాసు గారు ఈ కథతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నారు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు గారి వల్లే ఈ కథ మాకు వచ్చింది.
దర్శకుడు విజయేందర్ గురించి చెప్పండి?
విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్‌లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్‌తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు.
‘మిత్ర మండలి’లోని క్యాస్టింగ్ గురించి చెప్పండి?
డైరెక్టర్‌కి కథ రాసుకున్నప్పుడే క్యాస్టింగ్ మీద చాలా ప్లానింగ్ ఉంది. ఏ ఏ పాత్రకు ఎవరు కావాలని ముందు నుంచీ ఫిక్స్ అయి ఉన్నాడు. ప్రతీ పాత్రకు ఆయన తీసుకున్న ఆర్టిస్ట్‌లు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు.
‘మిత్ర మండలి’ని ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు కదా?
‘మిత్ర మండలి’ అనేది కూడా బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. మా మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.
ప్రియదర్శి, నిహారిక పాత్రలు ఎలా ఉండబోతోన్నాయి?
‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్‌ను డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్‌లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. నిహారిక మాట్లాడితే
ఓ సెటైర్ కనిపిస్తుంది. ఇందులో అలాంటి పాత్రే ఉంటుంది. అందుకే ఆమెను తీసుకున్నాం.
దీపావళికి పోటీ చాలానే ఉంది కదా?
దీపావళి పండుగ వాతావరణంలో ఎన్ని మంచి చిత్రాలు వచ్చినా జనాలు చూస్తారు. మంచి సినిమాను ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకంతోనే మా మూవీని దీపావళి సీజన్‌లోకి తీసుకు వస్తున్నాం.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్‌తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం.