హిందీలో సాలిడ్ మార్క్ అందుకున్న “కాంతారా 1”

హిందీలో సాలిడ్ మార్క్ అందుకున్న “కాంతారా 1”

Published on Oct 5, 2025 4:00 PM IST

లేటెస్ట్ గా కన్నడ సినిమా నుంచి వచ్చి పాన్ ఇండియా లెవెల్లో అదరగొడుతున్న చిత్రమే “కాంతార చాప్టర్ 1”. దర్శకుడు,హీరోగా కూడా తానే తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుని తెలుగు, హిందీ కన్నడ భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇలా హిందీ మార్కెట్ లో కూడా సాలిడ్ నంబర్స్ అందుకుంటున్న ఈ చిత్రం నిన్న శనివారం కూడా మంచి నంబర్స్ రిజిస్టర్ చేసుకుంది.

అయితే నిన్న 20 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఈ వసూళ్లతో కేవలం హిందీలోనే 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోయింది. ఇక ఈ ఆదివారం కూడా సాలిడ్ వసూళ్లు రానుండగా ఇంకొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోతుంది ఐ చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు