షాకింగ్ : సినిమా షూటింగ్ లో ప్రమాదం !

షాకింగ్ : సినిమా షూటింగ్ లో ప్రమాదం !

Published on Oct 5, 2025 10:54 AM IST

త‌మిళ విలక్షణ న‌టుడు సూరి – తెలుగు నటుడు సుహాస్ కలిసి న‌టిస్తున్న కొత్త చిత్రం ‘మండాడి’. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నై స‌ముద్ర తీరంలో శ‌రవేగంగా జ‌రుగుతోంది. కానీ, ఈ సినిమా షూటింగులో ఓ అపశృతి జరగడం దురదృష్టకరం. ఈ సినిమా షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో షూట్ చేస్తూ ఉండగా.. సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులతో పాటు కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు కూడా నీట మునిగిపోయాయి. అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించారు. దీంతో, ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి కూడా నీట మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సినిమాను జాతీయ అవార్డు గ్ర‌హాత వెట్రిమార‌న్ నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంతో వెట్రిమార‌న్ కి ఊహించని నష్టం జరిగింది.

తాజా వార్తలు