ఈ బంధం విడదీయరానిది – మెగాస్టార్ చిరంజీవి

ఈ బంధం విడదీయరానిది – మెగాస్టార్ చిరంజీవి

Published on Oct 5, 2025 1:04 PM IST

అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్‌ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాది, ఉత్తరాది నటులందరూ ఒకేచోట కలిసి, ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి అక్టోబర్‌ 4న చెన్నైలో పార్టీ చేసుకున్నారు. ఆ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.

ఇంతకీ, మెగాస్టార్ చిరంజీవి ఏం పోస్ట్ చేశారంటే.. ‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ ఎప్పటికీ మర్చిపోలేను. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు.. మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది. ప్రతిసారి మొదటి సమావేశంలానే ఉంటుంది’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు