కన్నడలో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ భారీ అంచనాల మధ్య వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా తొలి రోజే రూ.90 కోట్ల గ్రాస్ సాధించగా, వీకెండ్ కల్లా రూ.300 కోట్ల మార్క్ దాటింది.
ఇక వీకెండ్లో ఈ సినిమాకు పెద్ద పోటీలేక పోవడంతో కన్నడ, హిందీ మార్కెట్లలో లాంగ్ రన్ ఉండబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగులో కూడా దీపావళి రిలీజ్లు వచ్చే వరకు పెద్దగా పోటీ ఉండదని ట్రేడ్ అంచనా. మొత్తానికి దేశీయ మార్కెట్లో అన్ని ఏరియాల బయ్యర్లుకు మంచి లాభాలు ఖాయమని చెప్పొచ్చు.
అయితే, ఓవర్సీస్లో మాత్రం ఈ చిత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా అమెరికాలో బయ్యర్లకు నష్టాలు తప్పవని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ రైట్స్‌కే రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టినప్పటికీ, ప్రీమియర్స్ నుంచే కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో రాలేదు. ఫస్ట్ వీకెండ్ కల్లా వసూళ్లు 2.7 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోయాయి. దీంతో ఈ మూవీ ఫుల్ రన్లో గరిష్టంగా 4-5 మిలియన్ డాలర్లలోపు మాత్రమే రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా.