‘కాంతార చాప్టర్ 1’ దీపావళి గిఫ్ట్.. కొత్త ట్రైలర్ ఎప్పుడంటే..?

‘కాంతార చాప్టర్ 1’ దీపావళి గిఫ్ట్.. కొత్త ట్రైలర్ ఎప్పుడంటే..?

Published on Oct 16, 2025 2:33 AM IST

Kantara-Chapter-1

కన్నడలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తనదైన రీతిలో ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ చేస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది.

అయితే, దీపావళి కానుకగా ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ దీపావళి కానుకగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్‌ను అక్టోబర్ 16న మధ్యాహ్నం 12.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వారు చేశారు.

ఇక ఈ ప్రకటనతో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా.. ఈ ట్రైలర్‌లో సరికొత్త అంశాలు ఏవైనా ఉంటాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. హొంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు