‘తలైవి’ కోసం ‘కంగ‌నా’ మేకప్ మారనుంది ?

‘తలైవి’ కోసం ‘కంగ‌నా’ మేకప్ మారనుంది ?

Published on Apr 17, 2020 12:30 AM IST

దివంగత నేత జయలలిత బయోపిక్ గా రాబోతున్న చిత్రం ‘తలైవి’. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మేకప్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను పెట్టుకున్నారు. అయినా కంగనా, అమ్మలా కనిపించలేదని విమర్శలు వచ్చాయి. దాంతో చిత్రబృందం కంగనా మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పైగా కరోనా కారణంగా మేకప్ టెక్నీషియన్స్ మారే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ బదులు ఇక్కడి టెక్నీషియన్స్ నే పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్లు అని తెలుస్తోంది. ఎలాగూ కంగనాకి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ బయోపిక్ పై మంచి అంచనాలే ఉన్నాయి. తమిళ డైరెక్టర్ ఎ.ఎల్‌.విజ‌య్ దర్శకత్వంలో రానున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ ఎలా నటించి మెప్పిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు