హిందీ సినిమాల నుండి మన తెలుగు రంగానికి మరో రీమేక్ సిద్ధంగావుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘జానీ గద్దర్’ సినిమాను తెలుగులో ‘కమీనా’ రూపంలో తీసుకురానున్నారు. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. ఇతను గతంలో ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే సినిమాను తీసాడు. కుబేరా సినిమాస్ బ్యానర్ పై వరప్రసాద్ రెడ్డి అరమానంద నిర్మిస్తున్నారు. ఒక చిన్నపాటి ఫంక్షన్ పెట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేశారు. ఈ సినిమా కమర్షియల్ కామెడీలో సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతుంది. కృషి ఈ సినిమాతో హీరోగా పరిచయమవ్వనున్నాడు. ‘వేదం’ లేఖా వాషింగ్టన్ హీరోయిన్
ఈ సినిమా మొదటి కాపీ ఇప్పటికే సిద్ధమయ్యింది. సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అగస్త్య సంగీతదర్శకుడు