కమల్ కోసం క్రేజీ సీక్వెల్ సిద్ధం చేసిన స్టార్ డైరెక్టర్

కమల్ కోసం క్రేజీ సీక్వెల్ సిద్ధం చేసిన స్టార్ డైరెక్టర్

Published on Jun 17, 2020 4:47 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం వెట్టియాడు విలైయాడు. తెలుగులో రాఘవన్ పేరుతో విడుదలైన ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయనున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ కి గౌతమ్ మీనన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట.

ఇక కమల్ హాసన్ ఈ స్క్రిప్ట్ ఓకే చేస్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. ఇక ఈ క్రేజీ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించే అవకాశం కలదు. ప్రస్తుతం కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. హీరో సిద్దార్ధ్ ఓ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో కాజల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు